Monday, April 9, 2018

రంగస్థలం

నా ఇస్టమైన దర్శకుడు సుకుమార్.  నచ్చిన హీరో చరణ్.  ఇద్దరి కోంబో లో సినిమా అంటే ఆకాశమే హద్దు కదా...

చరణ్ ప్రతీ సినిమా మొదటి రోజే చూడటం అలవాటు.

ఐతే ఈ సారి మొదటి రోజు చూడటం కుదరలేదు.( కొద్దిగా కాలు బెణకడం, ఇంట్లో సినిమా చూడొద్దని గొడవ... )


ఫైనల్ గా మంగళవారం చూడటం కుదిరింది... రిక్లైనర్ సీట్లు, మంచి థియేటర్... ఫ్రీమాంట్ లో....

ఫుల్ గా ఆస్వాదించాను సినిమా ని.....

Monday, August 28, 2017

evaru number one ?

అప్పలయ్య అంబానీ కన్నా గొప్పవాడు.
కొండయ్య బ్యాట్ పట్టుకుంటే కోహ్లీ బలాదూరే..
మట్టయ్య ఎక్స్ప్రెషన్స్ ముందు పవన్ కల్యాణ్ ఒక మరగుజ్జు.

ఇక్కడ అప్పలయ్య, కొండయ్య, మట్టయ్య గార్ల గురించి నాకు తెలియదు గానీ, ఖచ్చితం గా ఇప్పటి ప్రకారం నెంబర్ వన్ ఎవరో ఇట్టే అర్ధమవుతుంది...


#RGV, #MaheshKathi #cheappublicity

Wednesday, June 14, 2017

క్రీడాస్ఫూర్తి

క్రీడలు జరుగుతున్నప్పుడు, మనం చూడవలసింది, ఆనందించవలసింది -- ఆ ఆట లో క్రీడాకారులు చూపించే నైపుణ్యాలు, విన్యాసాలు, ఆట జరుగుతున్నప్పుడు సాక్షాత్కారమయ్యే మెరుపులు, మాటల యుద్దాలు, నాటకీయత .. మాత్రమే.

దీనిని తీసుకొని రెండు దేశాల మద్య జరిగే పోరు గానో, యుద్దం గానో అనుకోవడం పొరబాటు.

ఒక దేశం యొక్క గొప్పతనం తెలిసేది వాళ్ళు సాధిస్తున్న వృద్ధి, సామరస్యం,  నీతివంతమైన పాలన, జీవన ప్రమాణం, ఆర్ధిక సూచీ, సాధారణ శాంతి భద్రతలు, తదితరాలు.

ఏదేమైనా, భారత్ మరియు బాంగ్లాదేశ్ , ఆ పై మనం గెలిస్తే జరిగే పాకిస్తాన్ తో ఆట.

భారత్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కోసం ఎదురు చూస్తూ....

Monday, June 5, 2017

Disney Land -- Magic Kingdom -- 2 June 2017

మ్యాజిక్ కింగ్ డం
---------------
డిస్నీ వరల్డ్ గురించి ఒక 10 సంవత్సరాలు గా విన్నాను.  ప్రత్యక్షం గా చూసే అవకాశం ఇన్నాళ్లకి వచ్చింది.  ఎన్నో సినిమాల్లో చూసిన ఆ రాజముద్ర ని పోలిన ముఖద్వారం దగ్గర ఫొటో తీసుకొని పార్కులో కింది అట్రాక్షన్స్ చూసాము.

1. యానిమల్ ఎడ్వెంచర్ : చాలా బాగుంది, చాల జంతువుల బొమ్మలు, సరస్సులో పెట్టి తెప్ప లో తిరుగుతూ చూసాము. (4.75/5) (ఎక్స్ ప్రెస్ పాస్)

2. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ : సూపర్బ్ గా వుంది.  సముద్రపు అట్టడుగున వెళ్తూ వున్నట్టు, దొంగలు, జంతువులు, జైళ్లు, ఇంక జాక్ స్పారో కనువిందు చేసారు.  (5/5)

3. అల్లావుద్దీన్ తివాచీలు : చెయ్యకుండా వుండల్సింది.  30 నిమిషాలు వెయిటింగ్. పరమ రొటీన్ రైడ్. (1.5/5)

4. స్పేస్ మౌంటేన్ : అద్భుతం గా ఉంది.  రోదసి లో ప్రయాణిస్తున్నట్టు తీర్చి దిద్దారు.  రోలర్ కోస్టర్ లాంటి రైడ్. (5/5)

5. ఫ్యూచర్ ట్రాన్స్ పోర్ట్ :  పార్క్ మొత్తం చూసాము (ఒక జోన్).  ఇలాంటి రైడ్ ముందు చెయ్యలేదు.  (4/5)

6. స్టిచ్ : ఏదో ల్యాబ్ లో జరిగే గందరగోళం లా వుంది.  నచ్చలేదు.  (2/5)

7. లాఫ్ క్లబ్ : కొన్ని జోకులు.. ఒకే ఒకే (2.5/5)

జోరున వర్షం...  విలువైన సమయం వృధా...

8. ఆ వర్షం లో నే నిల్చొని మెర్ మైడ్ (సాగరకన్య) రైడ్ చేసాం.  సాన్వి ఎంజాయ్ చేసింది.  బొమ్మలు, మెర్ మైడ్ కథ లా చెప్పడం బాగుంది.  మ్యూజిక్ బాగుంది.  (4.5/5)

మళ్లీ వర్షం... మా సహనాన్ని పరీక్షించింది.

9. ఒక ప్రిన్సెస్స్ స్టోరీ అంటే లైను లో నిల్చున్నాము.  తీరా అది ఫొటో సెషన్.  నిరాశ. (2/5)

10. సాన్వి గొడవ చేసి క్యారోసెల్ ఎక్కింది. (1.5/5)

11. మ్యాజిక్ టేల్ :  తక్కువ లైన్.  అదిరిన 3 డీ మూవీ.(4/5).  ఇక ఇక్కడి నించీ ప్రతీ నిమిషం ఎంజాయ్ చేసాము.

12. స్ప్లాష్ మౌంటైన్ :  అద్భుతం గా వుంది.  వివిద రకమైన సముద్ర జంతువుల బొమ్మలు, మ్యూజిక్, మరియు చక్కని థ్రిల్ రైడ్. (ఎక్స్ ప్రెస్  పాస్) (5/5)

13. హ్యపీలి ఎవర్ ఆఫ్టర్ : చక్కని బాణాసంచా ప్రదర్శన.  (4.25/5)

14. విన్నీ థ పూహ్ : చక్కని రైడ్.  పిల్లల రైడ్. సాన్వి కేరింతలు.  (4.5/5)

15. ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్ : అన్ని ఖండాలో నృత్యాలు, దుస్తులు, సంగీతం గురించి వివరించే చక్కని విహారం.  సాన్వి చిరునవ్వులు.  తక్కువ లైన్.  కేవలం 5 నిమిషాలు.(5/5)

16. పీటర్ పాన్ : ఏమిటో మంచాలు, బెడ్ రూంలు బాగా వున్నాయి, బహుశా పీట్ గాడి కలల ప్రపంచం ఏమో. బాగుంది.  (4.5/5)

17. బార్నేస్ కోస్టర్ : నీలిమ చక్కగా అడిగి తెలుసుకొని తీసుకెళ్లింది.  సాన్వి మొట్తమొదటి రోలర్ కోస్టర్. (5/5)

సాన్వి ఇంకా చేద్దాం అంటుంది :)

సమయం ముగిసింది.  11 అయింది.  ఒక మాగ్నెట్, ఇంకా సాన్వి కి ఒక మిక్కీ పెన్ కొన్నాం.

పరేడ్ కూడా చూసి ఉంటే, నూటికి నూరు మార్కులు అనుకునేవాడిని.

ఇంక చెయ్యలేని రైడ్ లు లేకపోలేదు.

సెవెన్ డ్వార్ఫ్ రైడ్
థ్రిల్లర్ మౌంటైన్
వాల్ట్ డిస్నీ రైల్ రోడ్

టిప్స్
1. 8.30 కల్లా డిస్నీ వెల్తే బాగుంటుంది.
2. పైన చెప్పిన రైడ్స్ -- టాప్ అట్రాక్షన్స్
3. మోనో రైల్ లో వెల్తే సమయం ఆదా.
4. క్యారెక్టర్ పలకరింపులు, పరేడ్ మిస్ చెయ్యడం బాధ కలిగించింది.

మళ్లీ వెళ్లినా డిస్నీ ల్యాండ్ కొత్త గానే వుంటుంది అని నమ్ముతూ --  ఇంత చక్కని పార్క్ ని నిర్వహిస్తున్న డిస్నీ వాళ్లకి ధన్యవాదాలు.

Friday, November 2, 2012

jaya jaya subhakara


జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !

బాహుదా2 నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకా2ర్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ||

పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు

లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||

Tuesday, August 10, 2010

brahma lokam to yama lokam

abbaaaaa

I didn't like this movie... this is a just a movie to watch in DVD..

Unfortunately, My mom loved it.... waackckck

the mass comedy, loud dialogues...

Anyways, from this I understood that we should not take anybody's opinions or even listen to them...

Keep the tastes and etc with your personel.... not to be influenced .....

Saturday, August 7, 2010

Jealous .... hmmm

Don't know what am I....

99.99% people are thinking in same way, I'm thinking it other way

:-(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((

Yelling out for unnecessary reasons, behaving like a crack guy ..... phew... certainly not me...

It doesn't mean, I never did this.... but when I exhibited this kind of emotions are far far back...

1. during my high schooling 7 - 10th class
2. during one important occassion - 2005.

Thats it..

Past 5 years I maintained good condition and stability in my behavior....

I'm getting stupid day by day !!!

should come out of this.... seriously......