Wednesday, June 14, 2017

క్రీడాస్ఫూర్తి

క్రీడలు జరుగుతున్నప్పుడు, మనం చూడవలసింది, ఆనందించవలసింది -- ఆ ఆట లో క్రీడాకారులు చూపించే నైపుణ్యాలు, విన్యాసాలు, ఆట జరుగుతున్నప్పుడు సాక్షాత్కారమయ్యే మెరుపులు, మాటల యుద్దాలు, నాటకీయత .. మాత్రమే.

దీనిని తీసుకొని రెండు దేశాల మద్య జరిగే పోరు గానో, యుద్దం గానో అనుకోవడం పొరబాటు.

ఒక దేశం యొక్క గొప్పతనం తెలిసేది వాళ్ళు సాధిస్తున్న వృద్ధి, సామరస్యం,  నీతివంతమైన పాలన, జీవన ప్రమాణం, ఆర్ధిక సూచీ, సాధారణ శాంతి భద్రతలు, తదితరాలు.

ఏదేమైనా, భారత్ మరియు బాంగ్లాదేశ్ , ఆ పై మనం గెలిస్తే జరిగే పాకిస్తాన్ తో ఆట.

భారత్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కోసం ఎదురు చూస్తూ....

Monday, June 5, 2017

Disney Land -- Magic Kingdom -- 2 June 2017

మ్యాజిక్ కింగ్ డం
---------------
డిస్నీ వరల్డ్ గురించి ఒక 10 సంవత్సరాలు గా విన్నాను.  ప్రత్యక్షం గా చూసే అవకాశం ఇన్నాళ్లకి వచ్చింది.  ఎన్నో సినిమాల్లో చూసిన ఆ రాజముద్ర ని పోలిన ముఖద్వారం దగ్గర ఫొటో తీసుకొని పార్కులో కింది అట్రాక్షన్స్ చూసాము.

1. యానిమల్ ఎడ్వెంచర్ : చాలా బాగుంది, చాల జంతువుల బొమ్మలు, సరస్సులో పెట్టి తెప్ప లో తిరుగుతూ చూసాము. (4.75/5) (ఎక్స్ ప్రెస్ పాస్)

2. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ : సూపర్బ్ గా వుంది.  సముద్రపు అట్టడుగున వెళ్తూ వున్నట్టు, దొంగలు, జంతువులు, జైళ్లు, ఇంక జాక్ స్పారో కనువిందు చేసారు.  (5/5)

3. అల్లావుద్దీన్ తివాచీలు : చెయ్యకుండా వుండల్సింది.  30 నిమిషాలు వెయిటింగ్. పరమ రొటీన్ రైడ్. (1.5/5)

4. స్పేస్ మౌంటేన్ : అద్భుతం గా ఉంది.  రోదసి లో ప్రయాణిస్తున్నట్టు తీర్చి దిద్దారు.  రోలర్ కోస్టర్ లాంటి రైడ్. (5/5)

5. ఫ్యూచర్ ట్రాన్స్ పోర్ట్ :  పార్క్ మొత్తం చూసాము (ఒక జోన్).  ఇలాంటి రైడ్ ముందు చెయ్యలేదు.  (4/5)

6. స్టిచ్ : ఏదో ల్యాబ్ లో జరిగే గందరగోళం లా వుంది.  నచ్చలేదు.  (2/5)

7. లాఫ్ క్లబ్ : కొన్ని జోకులు.. ఒకే ఒకే (2.5/5)

జోరున వర్షం...  విలువైన సమయం వృధా...

8. ఆ వర్షం లో నే నిల్చొని మెర్ మైడ్ (సాగరకన్య) రైడ్ చేసాం.  సాన్వి ఎంజాయ్ చేసింది.  బొమ్మలు, మెర్ మైడ్ కథ లా చెప్పడం బాగుంది.  మ్యూజిక్ బాగుంది.  (4.5/5)

మళ్లీ వర్షం... మా సహనాన్ని పరీక్షించింది.

9. ఒక ప్రిన్సెస్స్ స్టోరీ అంటే లైను లో నిల్చున్నాము.  తీరా అది ఫొటో సెషన్.  నిరాశ. (2/5)

10. సాన్వి గొడవ చేసి క్యారోసెల్ ఎక్కింది. (1.5/5)

11. మ్యాజిక్ టేల్ :  తక్కువ లైన్.  అదిరిన 3 డీ మూవీ.(4/5).  ఇక ఇక్కడి నించీ ప్రతీ నిమిషం ఎంజాయ్ చేసాము.

12. స్ప్లాష్ మౌంటైన్ :  అద్భుతం గా వుంది.  వివిద రకమైన సముద్ర జంతువుల బొమ్మలు, మ్యూజిక్, మరియు చక్కని థ్రిల్ రైడ్. (ఎక్స్ ప్రెస్  పాస్) (5/5)

13. హ్యపీలి ఎవర్ ఆఫ్టర్ : చక్కని బాణాసంచా ప్రదర్శన.  (4.25/5)

14. విన్నీ థ పూహ్ : చక్కని రైడ్.  పిల్లల రైడ్. సాన్వి కేరింతలు.  (4.5/5)

15. ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్ : అన్ని ఖండాలో నృత్యాలు, దుస్తులు, సంగీతం గురించి వివరించే చక్కని విహారం.  సాన్వి చిరునవ్వులు.  తక్కువ లైన్.  కేవలం 5 నిమిషాలు.(5/5)

16. పీటర్ పాన్ : ఏమిటో మంచాలు, బెడ్ రూంలు బాగా వున్నాయి, బహుశా పీట్ గాడి కలల ప్రపంచం ఏమో. బాగుంది.  (4.5/5)

17. బార్నేస్ కోస్టర్ : నీలిమ చక్కగా అడిగి తెలుసుకొని తీసుకెళ్లింది.  సాన్వి మొట్తమొదటి రోలర్ కోస్టర్. (5/5)

సాన్వి ఇంకా చేద్దాం అంటుంది :)

సమయం ముగిసింది.  11 అయింది.  ఒక మాగ్నెట్, ఇంకా సాన్వి కి ఒక మిక్కీ పెన్ కొన్నాం.

పరేడ్ కూడా చూసి ఉంటే, నూటికి నూరు మార్కులు అనుకునేవాడిని.

ఇంక చెయ్యలేని రైడ్ లు లేకపోలేదు.

సెవెన్ డ్వార్ఫ్ రైడ్
థ్రిల్లర్ మౌంటైన్
వాల్ట్ డిస్నీ రైల్ రోడ్

టిప్స్
1. 8.30 కల్లా డిస్నీ వెల్తే బాగుంటుంది.
2. పైన చెప్పిన రైడ్స్ -- టాప్ అట్రాక్షన్స్
3. మోనో రైల్ లో వెల్తే సమయం ఆదా.
4. క్యారెక్టర్ పలకరింపులు, పరేడ్ మిస్ చెయ్యడం బాధ కలిగించింది.

మళ్లీ వెళ్లినా డిస్నీ ల్యాండ్ కొత్త గానే వుంటుంది అని నమ్ముతూ --  ఇంత చక్కని పార్క్ ని నిర్వహిస్తున్న డిస్నీ వాళ్లకి ధన్యవాదాలు.