Thursday, July 9, 2009

Telugu song lyrics : Premikudu : O Cheliya

సంగీతం : ఏ ఆర్ రెహమాన్
గానం : ఉన్ని కృష్ణన్

ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
ఏ చొట అది జారినదో ఆ జాడే మరచితినే


నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే...

నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే

ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

ఈ పూటా చెలి నా మాటా ఇక కరువైపోయేనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగేనులే
వీక్షణ లో నిరీక్షణ లో అర క్షణమొక యుగమే లే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయేనులే

ఇది స్వర్గమా నరకమా ఏమిటొ తెలియదు లే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలొ ఉన్నది లే ....

ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

కోకిలమ్మా నువ్వు సయ్యంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చెరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జొల పాడి గాలి మెటికలు విరిచేనే
వీచెటి చలి గాలులకు తెర చాపై నిలిచే లే

నా అశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే ....

ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

ఏ చొట అది జారినదో ఆ జాడే మరచితినే
నీ అందెలలొ చిక్కుకుంది అని నీ పదముల చేరితినే

ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే...

నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే.......

Telugu song lyrics : Janavule - Aditya 369

సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : జిక్కి, బాలు, శైలజ

నెరజాణవులే ... వర వీణవులే
కిలికించితాలలో...ఆహహహ

జాణవులే మృదుపాణివిలే
మథు సంతకాలలో

కన్నులలో .....సరసపు విన్నెలు లే
సన్నలలో .....గుస గుస తెమ్మెరలే
మోవి గనీ, మొగ్గగ నే మోజు పడిన వేళలో

జాణవులే వర వీణవులే
కిలికించితాలలో...ఆహహహ

జాణవులే మృదుపాణివిలే
మథు సంతకాలలో

మోమటు దాచి మురిపెము పెంచే లాహిరిలొ
అహ హా హ హ హ ఒహ్హొ హో హొ హొ హొ హొ హొ

మూగవు గానే మురళిని ఊధే వైఖరి లో

చెలి ఒంపులలో హంపి కళా ఊగె ఉయ్యాలా
చెలి పయ్యెదలొ తుంగ అలా పొంగే ఈ వేళా
మరియాదకు విరిపానుపు సవరించవేమి రా

జాణవులే వర వీణవులే
కిలికించితాలలో...ఆహహహ
జాణవులే మృదుపాణివిలే
మథు సంతకాలలో

చీకటి కోపం ... చెలిమికి లాభం ...కౌగిలిలో
అహ హా హ హ హ ఒహ్హొ హో హొ హొ హొ హొ హొ

వెన్నెల తాపం ... వయసుకు ప్రాణం ఈ చలి లొ
చెలి నా రతిలా హారతి లా నవ్వాలీవేళ
తొలి సొయగమే ఓ సగము ఇవ్వాలీ వేళా
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

జాణవులే వర వీణవులే
కిలికించితాలలో...ఆహహహ
జాణవులే మృదుపాణివిలే
మథు సంతకాలలో

Telugu song lyrics : Nee guna gaanamu

గానం : ఘంటసాల
రచన : సముద్రాల

ప్రభో ... ఓ ... ప్రభో... ఓ ఓ ఓ ...

నీ గుణగానము నీ పద ధ్యానము
అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం 2

చరణం 1:

నీలాద్రి శిఖరాన నెలకొని యున్నా..
నీ నగుమోము అందము గన్నా
యే అందమైనా వెగటే నన్నా

జగదేక మోహన సుందరాకారా ...

నీ గుణగానము నీ పద ధ్యానము
అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం

చరణం 2:

ఏ ఈతి భాధా ఎదురైన గానీ ..
మోహవికారము మూసిన గానీ
నీ పాద సేవా విడదీయకన్నా

శరణాగతావన హే జగన్నాధా ....

నీ గుణగానము నీ పద ధ్యానము
అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం