సంగీతం : ఏ ఆర్ రెహమాన్
గానం : ఉన్ని కృష్ణన్
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
ఏ చొట అది జారినదో ఆ జాడే మరచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే...
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
ఈ పూటా చెలి నా మాటా ఇక కరువైపోయేనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగేనులే
వీక్షణ లో నిరీక్షణ లో అర క్షణమొక యుగమే లే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయేనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటొ తెలియదు లే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలొ ఉన్నది లే ....
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
కోకిలమ్మా నువ్వు సయ్యంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చెరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జొల పాడి గాలి మెటికలు విరిచేనే
వీచెటి చలి గాలులకు తెర చాపై నిలిచే లే
నా అశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే ....
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
ఏ చొట అది జారినదో ఆ జాడే మరచితినే
నీ అందెలలొ చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే...
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే.......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment