Sunday, August 16, 2009

Annamayya kruthi - Muddu gaare

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు


రతికేళి రుక్మిణి కి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గో మేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధి లోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగీ పద్మనాభుడు

No comments: