పాట : ప్రజా రాజ్యమిది
సంగీతం : మణిశర్మ
గానం : రాం చరణ్ తేజ
ప్రజా రాజ్యమిది .. ప్రజలందరిది
పేదోడి కలా ... నెరవేరినది
అటు ఇటు జనసంద్రం పొంగి పొరలుతుంది
నరాలలో ఆవేశం నింగినంటుతుంది
ఛలో ఛలో చెలరేగుదాం మనం
ఛలో ఛలో గెలిపించి తీరుదాం
చరణం 1:
ఏ లంచములు వంచనలు లేని కొత్త రాజ్యం
నీ కంచములో గింజలనే నింపు నిండు రాజ్యం .. 2
కరువుని ఆపేదీ ... నీ పరువుని మోసేది
కులములు ఏమైనా నిను కలుపుకు పొయేది
చరణం 2:
ఈ సంపద నే అందరికీ పాలు పంచుతుంది
ఈ రాష్ట్రము లో అవినీతి ని పారద్రోలుతుంది .. 2
బడుగులదీ రాజ్యం .... నవ యువకులదీ రాజ్యం
మహిళలదీ రాజ్యం ... అలుపెరగదు ఈ రాజ్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment